హోటళ్లలో నాణ ్యతా ప్రమాణాలు కరువు
నర్సాపూర్: హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు సరైన తనిఖీలు చేయకపోవడంతో ఆహారంలో నాణ్యత లోపిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లేని వస్తువులతో తిను బండారాలు తయారు చేయడంతో వాటిని తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో హోటళ్లు, తిను బండారాల కేంద్రాలు సుమారు 50 వరకు ఉన్నాయి. వ్యాపారులు రుచి కోసం రసాయనాలు, ఎక్కువ రంగులు కలిపిన వస్తువులు వాడుతున్నారని తెలిసింది. ఆయా శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులు వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకొని పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
పలువురికి ఫుడ్ పాయిజన్
నర్సాపూర్–మెదక్ మార్గంలోని ఓ మండీ హోటల్‌లో పట్టణానికి చెందిన ముగ్గురు యు వకులు సోమవారం రాత్రి భోజనం చేశారు. ఇంటికి వెళ్లిన అనంతరం ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ఆస్పత్రుల్లో చేరి వైద్యం పొందుతున్నారు. వీరితో పాటు పట్టణంలోని మరికొందరు సైతం అదే మండీ హోటల్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ సాయికుమార్‌ను వివరణ కోరగా.. పట్టణంలోని ఓ హోటల్‌లో సోమవారం రాత్రి భోజనం చేసిన వారిలో కొందరికి ఫుడ్ పాయిజన్ అయిన విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇటీవల పని ఒత్తిడితో హోటళ్లలో తనిఖీలు చేయలేకపోయాం. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేసి నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.


