రైతులను అప్రమత్తం చేయండి | - | Sakshi
Sakshi News home page

రైతులను అప్రమత్తం చేయండి

Oct 14 2026 11:22 AM | Updated on Oct 14 2026 11:22 AM

● ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది

● అధికారులకు కలెక్టర్‌ దిశా నిర్దేశం

మెదక్‌ కలెక్టరేట్‌: ఎల్‌నినో విపత్తును దృష్టిలో పెట్టుకొని రైతులను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ.. జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తాగు, సాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రాబోయే రెండు రోజుల్లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటిపారుదల తదితర శాఖలు తమ పరిధిలోని పరిస్థితులను క్షేత్రస్థాయి లో పరిశీలించి, అవసరమైన చర్యలతో నివేదికలు అందించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధికారు లు అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవిలో మంచినీటి సమస్య రాకుండా సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్‌, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఉద్యా నవన అధికారి ప్రతాప్‌సింగ్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement