మెదక్ కలెక్టరేట్: జాతీయ వైద్యారోగ్యశాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద గల ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఆరోగ్యశాఖలో 377 మంది ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నట్లు చెప్పారు. కనీస వేతనం, రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం వందశాతం వేతనం ఇవ్వాలని, ఔట్ సోర్సింగ్ ఏజేన్సీలను రద్దు చేయాలన్నారు. మహిళా ఉద్యోగికి ప్రసూతి సెలవులు 108 రోజులు ప్రకటించాలని కోరారు. జీఓ 60 ప్రకారం తక్షణమే వేతన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు డాక్టర్ ప్రియాంక, సాయి కిరణ్, నవీన్, అంబదాస్, శ్రీలత, ఎన్‌హెచ్‌ఎం, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


