చిన్నశంకరంపేట(మెదక్): బీడీ కార్మికులకు నెలకు రూ.4,016 జీవన భృతి వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ టీయూసీఐ ఆధ్వర్యంలో నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తమకు ప్రభుత్వం చెప్పిన విధంగా జీవన భృతి పెంచి అందించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు పిట్ల రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు నెలకు రూ.4016 జీవన భృతిని అందించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమేశ్, సత్తమ్మ, ప్రకాశ్ కిషోర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


