కలెక్టర్ ప్రతిమాసింగ్
రామాయంపేట(మెదక్): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగు వైపు దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. సోమవారం స్థానిక రైతు వేదికలో జరిగిన ‘రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్’కు ఆమె హాజరై మాట్లాడారు. వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంతో ఈసారి జిల్లాలో 1.94 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు అయిందన్నారు. రైతులు తమకు అందుబాటులో ఉన్న వివిధ సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని ప్రత్యా మ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గతంలో కంటే ఈసారి అధికంగా 28 వేల ఎకరాల్లో అంతర పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాగు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. నీటి కొరత తలెత్తితే రైతులు నష్టాలకు గురి కావడంతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్, మండల ప్రత్యేక అధికారి సురేశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, బైరం స్వప్న, డాకి శ్యామల, ప్రవీణ్, ఆదర్శ రైతులు అశోక్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.


