నర్సాపూర్ రూరల్: కరెంట్ కోతలపై రైతులు కన్నెర్ర చేశారు. నర్సాపూర్– మెదక్ 765డీ జాతీయ రహదారిలోని రెడ్డిపల్లి వద్ద చిప్పల్తుర్తి, జక్కపల్లి, ఆయా గిరిజన తండాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. అలాగే నర్సాపూర్– సంగారెడ్డి రహదారిలోని అవంచ వద్ద ఏల్లాపూర్, మాడాపూర్, అవంచ గ్రామాల రైతులు రాస్తారోకోకు దిగారు. రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. రైతులకు మద్దతుగా సర్పంచ్లు భరత్ కుమార్, సుధాకర్, కరుణాకర్, సునీత రాములు నాయక్తో పాటు ఆయా గ్రామాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.


