యూరియా దొరకదు.. కరెంట్‌ రాదు | - | Sakshi
Sakshi News home page

యూరియా దొరకదు.. కరెంట్‌ రాదు

Oct 9 2026 6:48 AM | Updated on Oct 9 2026 6:48 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): రైతులకు సరైన విద్యుత్‌ అందించకుంటే చూస్తూ ఊరుకోమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం నార్సింగి సబ్‌స్టేషన్‌ ఎదురుగా బీఆర్‌ఎస్‌ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క నిమిషం కరెంట్‌ పోలేదన్నారు. కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో రైతుల ఉసురు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం గురించి సీఎం ఒక్క సమీక్ష కూడా చేయడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు యూరియా దొరకడం లేదు, పంటలకు సరైన కరెంట్‌ రావడం లేదన్నారు. ఇప్పటికై నా 15 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్‌ ఖతం కావడం ఖాయమన్నారు. అంతకుముందు సబ్‌స్టేషన్‌ లాగ్‌బుక్‌ పరిశీలించి విద్యుత్‌ సరఫరాపై ఆరా తీశారు. ఎస్‌ఈతో ఫోన్‌లో మాట్లాడి రైతులకు మెరుగైన విద్యుత్‌ అందించేందకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, నార్సింగి సర్పంచ్‌ సుజాతగౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మైలారం బాబు, నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీలు మల్లేశంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎమ్మెల్యే

కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement