మెదక్ కలెక్టరేట్: జిల్లా ఎన్హెచ్ఎం విభాగంలో 64 పోస్టులకు కాంట్రాక్ట్ పద్దతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 6 నుంచి ప్రక్రియ ప్రారంభించారు. గురువారం పలు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. కొంతమంది మహిళలు చంటిబిడ్డలతో తరలివచ్చారు. కాగా ఈనెల 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం 64 పోస్టులు ఉండగా, మూడు రోజుల్లో 550 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో స్టాఫ్‌నర్స్ 280, ఏఎన్ఎం 130, ల్యాబ్ టెక్నీషియన్ 80, ఎంఎల్హెచ్పీసీహెచ్ఓ 60 దరఖాస్తులు వచ్చినట్లు సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు.


