మెదక్‌జోన్: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరాలపై అవగాహన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. గుర్తుతెలియని కాల్స్, మెసేజ్‌లు, లింకులు, అనుమానాస్పద ఆఫర్లకు స్పందించవద్దని అన్నారు. పార్ట్‌టైం జాబ్, లోన్ యా ప్, ఆన్‌లైన్ షాపింగ్, పెట్టుబడులు, అధికారుల పేరుతో జరిగే ఇంపర్సనేషన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో సైబర్ క్రైం డీఎస్పీ సుభాశ్ చంద్రబోస్, ఆర్‌ఐ శైలెందర్, సిబ్బంది పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాములు
రామాయంపేట(మెదక్): తీవ్రమైన విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులపాలవుతున్నా ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు ఆరోపించారు. బుధవారం విద్యుత్‌శాఖ ఏఈ తిరుపతిరెడ్డికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. అప్పులు చేసి పంట సాగు చేస్తున్న రైతులు తీ వ్ర ఆందోళన మధ్య కొట్టుమిట్టాడుతున్నారని వివరించారు. 12 గంటల పాటు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, వాస్తవానికి 5 గంటలకు మించి సరఫరా కావడం లేద న్నారు. తరచూ సరఫరాలో అవాంతరాలతో తడిపిన మడులే మళ్లీ తడుస్తున్నాయని తెలిపా రు. విద్యుత్ సరఫరా మెరుగుపడకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అక్కన్నపేట సర్పంచ్ యాదగిరి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రంగయ్య, జిల్లా నాయకులు అనిల్‌కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట(మెదక్): పట్టణ శివారులో కొనసాగుతున్న ఆధ్యా గ్రాండ్ హోటల్‌ను బుధవారం ఫుడ్ సెక్యూరిటీ అధికారులు సీజ్ చేశారు. హోటల్ లైసెన్స్ రిన్యూవల్ చేసుకోకపోవడంతో పాటు నిబంధనల మేరకు కొనసాగకపోవడంతో ఫుడ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. వారి ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ సెక్యూరిటీ అధికారి స్వదీప్‌కుమార్ హోటల్ నిర్వాహకులకు నోటీస్ అందజేసి సీజ్ చేశారు.
హవేళిఘణాపూర్(మెదక్): జిల్లా దిశ కమిటీ మెంబర్‌గా హవేళిఘణాపూర్‌కు చెందిన ఎంఎల్‌రెడ్డిని నియమిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నర్సాపూర్‌కు చెందిన రమేశ్‌గౌడ్, స్వప్న, పద్మను సైతం కమిటీ మెంబర్లుగా నియమించారు. తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు ఎంఎల్‌రెడ్డి పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
కొల్చారం(నర్సాపూర్): 2008 స్పెషల్ టీచర్లుగా నియామకమైన వారికి ఎస్జీటీ పే స్కేల్ వర్తింపజేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు సంగయ్య, నజిరొద్దీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని చిన్నఘనాపూర్ ఉన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ వెంటనే ప్రకటించాలన్నారు. ప్రభుత్వం ప్రతీ నెల విడుదల చేసే రూ.2 వేల కోట్ల బకాయిలు రెండు నెలలుగా విడుదల చేయడం లేదన్నారు. కార్యక్రమంలో సంగం మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


