ఆప్యాయత ఒడికి అభాగ్యులు | - | Sakshi
Sakshi News home page

ఆప్యాయత ఒడికి అభాగ్యులు

Oct 8 2026 6:59 AM | Updated on Oct 8 2026 6:59 AM

● చట్టబద్ధతతో

చిన్నారులకు కొత్త జీవితం

● రెండేళ్లు అధికారుల పర్యవేక్షణ

● మాతృత్వానికి మరో మార్గం

తల్లిదండ్రులు లేని అభాగ్యులు ఆప్యాయత ఒడికి చేరుతున్నారు. అనాధాశ్రమంలో ఉంటూ ప్రేమానురాగాలకు దూరమైన చిన్నారులు దత్తతతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఉద్యోగ సాధన తదితర కారణాలతో ఆలస్యంగా వివాహాలు చేసుకొని సంతానం కలగకపోవడంతో పలువురు మనోవేదనకు గురవుతున్నారు. వీరికి సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ వెసులుబాటు కల్పిస్తుంది. ప్రేమానురాగాలకు దూరమైన చిన్నారులు దత్తతతో కొత్త బంగారు జీవితానికి బాటలు పడుతున్నాయి. – సంగారెడ్డి జోన్‌

వివిధ కారణాలతో మాతృత్వానికి దూరమవుతున్న చిన్నారులకు జిల్లా సంక్షేమ శాఖ ఆశ్రయం కల్పిస్తుంది. అర్హులైన దంపతులకు 2010 నుంచి చట్టబద్ధంగా దత్తత ఇస్తుంది. ఇప్పటివరకు 129 మందికి దత్తత ఇచ్చి, కొత్త జీవితాలను అందించింది. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాల, బాలికలు తేడా లేకుండా ముందుకు వస్తున్నారని సంక్షేమ శాఖ నిర్వాహకులు చెబుతున్నారు.

విదేశీయులు సైతం ఆసక్తి

అభాగ్యులకు కొత్త జీవితం అందించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల వారే కాకుండా విదేశీయులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర దేశాలలో కూడా ఇక్కడి మాదిరిగానే అనుబంధ సంస్థలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఇక్కడి నిర్వాహకులను సంప్రదించి దత్తత తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లా నుంచి అమెరికా 8 మంది, యూకే, మాల్టా ఒకరు చొప్పున దత్తత పొందారు. మరికొన్ని దేశాల వారు దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

బాలికలే అధికం

జిల్లావ్యాప్తంగా దత్తత పొందిన వారిలో అత్యధికంగా బాలికలే ఉన్నారు. గత 17 సంవత్సరాల్లో 129 మందిని దత్తత తీసుకున్నారు. ఇందులో 91 మంది బాలికలు ఉండగా, 38 మంది బాలురు ఉన్నారు. దత్తత పొందిన అనంతరం రెండేళ్ల పాటు పర్యవేక్షిస్తారు. విదేశాల్లో సైతం అక్కడి సిబ్బందితో పర్యవేక్షణ జరుపుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement