చిన్నశంకరంపేట(మెదక్): విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు కన్నెర్ర చేశారు. బుధవారం మండలంలోని గవ్వలపల్లి చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. వ్యవసాయానికి సరైన విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని విద్యుత్‌శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్– చేగుంట ప్రఽ దాన రహదారిపై బైఠాయించడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీస్‌లు రైతులను సముదాయించేందుకు ప్రయత్నించగా, ట్రాన్స్‌కో అధికారులు వచ్చి సరైనా సమాధానం చెప్పేవరకు కదిలేదిలేదని మొండికేశారు. దీంతో ఎస్ఐ శివానందం ఫోన్లో పరిస్థితి వివరించడంతో ట్రాన్స్‌కో ఏడీ మోహన్‌బాబు, ఏఈ దినకర్ వచ్చి రైతులతో మాట్లాడారు. పంటలు ఎడిపోతున్నాయి కనీసం 12 గంటల విద్యుత్ అయినా అందించండి సారూ అంటూ చెన్నాయిపల్లికి చెందిన ఓ రైతు ఏడీ మోహన్‌బాబు కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. దీంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ఏడీ డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అంటూ రైతులు నినదించారు. చివరికి 9 గంటల విద్యుత్ సరఫరా నిరంతరం అందిస్తామని ఏడీ, ఏఈ రైతులను చెప్పడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నా యకులు రాజు, కుమార్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సర్పంచ్ సిద్దిరాములు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పోచయ్య, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


