మెదక్ కలెక్టరేట్: దేశ అభివృద్ధి లక్ష్యాలతో సాగుతున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో ‘సేవా జ్యోతి కలశ యాత్ర’ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్‌రావు హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా ప్రారంభమై ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారని తెలిపారు. అనంతరం రాందాస్ చౌరస్తా నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్త లు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జి నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్‌రెడ్డి, సురేశ్, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్‌తో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు


