బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్
నర్సాపూర్: వృద్ధాశ్రమంలో పనిచేయడమే గొప్ప సేవా కార్యక్రమమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ అన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన నెల రోజుల ‘సేవ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా మంగళవారం స్థానిక వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, వారికి సేవలందిస్తున్న సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మల్లేశ్‌గౌడ్ వెంట పార్టీ నాయకులు లక్ష్మీపతి, రమేష్‌గౌడ్, ఆంజిగౌడ్, నగేష్, ప్రేమ్‌కుమార్, బాల్‌రాజ్, పద్మారావు, రాజిరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


