పంటలెండుతున్నా పట్టింపేదీ? | - | Sakshi
Sakshi News home page

పంటలెండుతున్నా పట్టింపేదీ?

Oct 6 2026 8:31 AM | Updated on Oct 6 2026 8:31 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌)/శివ్వంపేట: వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్‌ ఇవ్వకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని, అయినా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం మండలంలోని రాజీపేటలో ఎండిన వరి పంటను పరిశీలించారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ లాగ్‌బుక్‌ను తనిఖీ చేసి మాట్లాడారు. సాగుకు కనీసం అయిదు గంటల త్రీఫేజ్‌ కరెంట్‌ సరఫరా కావడం లేదన్నారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు సార రామాగౌడ్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు ఎల్లం, మహిపాల్‌రెడ్డి, లక్ష్మణ్‌, శివ, మల్లేశం, శివారెడ్డి, బాలకృష్ణ, కుత్‌బొద్దీన్‌, పాష, పోల నవీన్‌, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే శివ్వంపేట మండల పరిధి గంగాయపల్లిలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించారు. అనంతరం మండల పరిధి గంగాయపల్లి నుంచి పలు గిరిజన తండాలను కలుపుతూ చండీ వరకు బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సాయిలు, నారాయణరావు, ప్రవీణ్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ పవన్‌ కుమార్‌ గుప్తా, బీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట్‌ రెడ్డి, శేఖర్‌గౌడ్‌, నర్సింగరావు, లాయక్‌, మహేందర్‌రెడ్డి, కాంతారావు, జగన్‌ రెడ్డి, పెంటాగౌడ్‌, రాజునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సునీతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement