పంటలెండుతున్నా పట్టించుకోరా? | - | Sakshi
Sakshi News home page

పంటలెండుతున్నా పట్టించుకోరా?

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

చిన్నశంకరంపేట(మెదక్‌): విద్యుత్‌ సరఫరాలో అంతరాయంతో నీరందక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి విమర్శించారు. ఆదివారం మండలంలోని కొర్విపల్లిలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించారు. అనంతరం గవ్వలపల్లి సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌ను పరిశీలించారు. కనీసం రోజుకు 7 గంటల విద్యుత్‌ కూడా సరఫరా కావడం లేదన్నారు. తరచూ విద్యుత్‌ ఎందుకు ట్రిప్‌ అవుతుందని సిబ్బందిని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్‌ దేవుడెరుగు కనీసం 12 గంటలు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే సబ్‌స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులను మోసం చేస్తుస్తున్న కాంగ్రెస్‌ సర్కారు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఆమె వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు రాజు, నరేందర్‌, లక్ష్మారెడ్డి, యాదగిరి, మల్లేశం, గోపాల్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement