కరెంట్‌ కోతలపై కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కోతలపై కన్నెర్ర

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

రామాయంపేట(మెదక్‌): కరెంట్‌ కోతలకు నిరసనగా రైతులు రోడ్డెక్కారు. శనివారం స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదురుగా రామాయంపేట– మెదక్‌ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశా రు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం రైతులు మాట్లాడుతూ.. ప్రతి రోజు నాలుగు గంటలు కూడా సక్రమంగా విద్యుత్‌ సరఫరా కావడం లేదని ఆరోపించారు. ఈవిషయమై పలుమార్లు విద్యుత్‌ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. దీంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని వాపోయారు. అలాగే తరచూ కరెంట్‌ ట్రిప్‌ అవుతుండటంతో పారిన మడి మళ్లీ పారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఎస్‌ఐ బాల్‌రాజు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

రామాయంపేటలో రోడ్డెక్కిన రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement