నెల పాటు సేవా కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

నెల పాటు సేవా కార్యక్రమాలు

Oct 3 2026 7:24 AM | Updated on Oct 3 2026 7:24 AM

నెల పాటు సేవా కార్యక్రమాలు నేడు హరీశ్‌రావు రాక కూలీలకు ఉపాధి హామీ వరం ముమ్మరంగా పనులు చేపట్టాలి

నర్సాపూర్‌: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని గత నెల 17 నుంచి ఈనెల 17వ తేదీ వరకు సేవా సంకల్ప్‌ అభియాన్‌ కార్యక్రమం చేపడుతున్నామని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సేవా జ్యోతి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా ఈనెల 4న తూప్రాన్‌ మండలం బ్రాహ్మణపల్లి వద్ద అమూల్‌ పాల కంపెనీ నిర్మాణానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భూమి పూజ చేస్తారని వెల్లడించారు. కంపెనీతో రైతులకు ఆర్థికంగా భరోసా ఏర్పడుతుందని అన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, జిల్లా ఇన్‌చార్జి నర్సింహారెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌ రూరల్‌: మండలంలోని కాగజ్‌మద్దూర్‌ గ్రామానికి శనివారం మాజీ మంత్రి హరీశ్‌రావు రానున్నారు. పలు గ్రామాలకు చెందిన ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరనున్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి సైతం హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలని పార్టీ నేతలు కోరారు.

రేగోడ్‌(మెదక్‌): గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మండలంలోని గజ్వాడలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వీబీజీ రాంజీ పథకం ద్వారా 375 రకాల పనులు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు మున్నూరు కిషన్‌, ఎంపీడీఓ శ్రీనివాస్‌, ఎపీఓ జగన్మోహన్‌సింగ్‌, ఏఈఓ అంబిక, కార్యదర్శి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

కౌడిపల్లి(నర్సాపూర్‌): గ్రామాల అభివృద్ధికి ‘వీబీజీరాంజీ’ పథకం ద్వారా ముమ్మరంగా పనులు చేయాలని జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్‌ తెలిపారు. శుక్రవారం కౌడిపల్లి రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. కూ లీలు ఎంత ఎక్కువగా పనులు చేస్తే గ్రామాభివృద్ధికి అంతే ఎక్కువగా నిధులు వస్తాయని చెప్పారు. ఇందులో జలసిరి పను లు, ఇంటింటికీ ఇంకుడుగుంతలు, ఫాంపాండ్ల నిర్మాణంతో పాటు మట్టిరోడ్లు, కట్టుకాల్వల పునరుద్ధరణ తదితర పనులు చేపట్టవచ్చన్నారు. అనంతరం స్మార్ట్‌రేషన్‌ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శ్వేత, పంచాయతీ కార్యదర్శి నగేశ్‌, వార్డు సభ్యులు ప్రశాంత్‌, మురళి, దేవేందర్‌, రమేశ్‌, నాయకులు పోల నవీన్‌, సంగప్ప, హరీశ్‌, అశోక్‌ గ్రామస్తులు

త దితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement