రాక్‌బాల్‌ పోటీల్లో చాంపియన్‌ హరియాణ | - | Sakshi
Sakshi News home page

రాక్‌బాల్‌ పోటీల్లో చాంపియన్‌ హరియాణ

Sep 9 2026 11:57 AM | Updated on Sep 9 2026 11:57 AM

మిక్స్‌డ్‌ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచిన తెలంగాణ జట్టుకు

జ్ఞాపిక అందజేత

జాతీయ స్థాయి రాక్‌బాల్‌ పోటీల్లో మిక్స్‌డ్‌ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన హరియాణ జట్టుకు జ్ఞాపికను అందజేస్తున్న నిర్వాహకులు

నర్సాపూర్‌: పోటాపోటీగా జరిగిన రాక్‌బాల్‌ జాతీయ స్థాయి పోటీలలో మెన్స్‌ విభాగంలో హరియాణ జట్టు ప్రథమ స్థానంలో నిలువగా ఉత్తరప్రదేశ్‌ జట్టు ద్వితీయ స్థానం, తెలంగాణ జట్టు తృతీ య స్థానంలో నిలిచాయి. కాగా మహిళల విభాగం పోటీల్లో హరియాణ జట్టు ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా చత్తీస్‌ఘడ్‌ జట్టు ద్వితీయ స్థానం, ఉత్తరప్రదేశ్‌ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. ఇదిలాఉండగా మిక్స్‌డ్‌ విభాగంలో హరియాణ రాష్ట్ర జట్టు ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోగా తెలంగాణ జట్టు ద్వితీయస్థానంలో నిలువగా చత్తీస్‌ఘడ్‌ జట్టు క్రీడాకారులు తృతీయ స్థానంలో నిలిచారు.

ముగిసిన పోటీలు

కాగా, అజయ్‌యాదవ్‌ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో జరిగిన పదవ సీనియర్‌ జాతీయ, ఏడవ సీనియర్‌ మిక్స్‌డ్‌ జాతీయ రాక్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు మూడు రోజులపాటు జరిగాయి. కాగా, మంగళవారం రాక్‌బాల్‌ పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి ముఖ్యఅథితిగా పాల్గొనగా ఉమ్మడి మెదక్‌ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ రాజమణి, ఆల్‌ఇండియా రాక్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి భూపాల్‌ సాగ్వాన్‌, సౌత్‌ ఇండియా రాక్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మురళీయాదవ్‌, రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడు సునీల్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సాయికుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, వైస్‌ చైర్మన్‌ బుచ్చెష్‌ తదితరులు పాల్గొని విజేతలకు పతకాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement