● మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి ● అదనపు డీసీపీకి ఫిర్యాదు
పటాన్‌చెరు టౌన్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాటా మధుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాటా సుధారాణి, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అదనపు డీసీపీ ఉదయ్‌కుమార్, సీఐ రవీందర్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారని, ఆయనపై చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధ పదవిని అవమానించడంతోపాటు ఎస్సీ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్పింగ్‌లు వార్తా మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నాయని, వాటిని పరిశీలించి విచారణ చేపట్టాలని కోరారు.


