సబ్సిడీ పథకాలు సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ పథకాలు సద్వినియోగం చేసుకోండి

Mar 16 2026 8:54 AM | Updated on Mar 16 2026 8:54 AM

స్వయం ఉపాధి పథకాలకు 24 వరకు ఆన్‌లైన్‌ చేసుకునే అవకాశం

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ వెల్లడి

మెదక్‌ కలెక్టరేట్‌: స్వయం ఉపాధి ద్వారా జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ సబ్సిడీ పథకాలు అందజేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో 2025–26 వార్షిక ప్రణాళిక అమలు చేసేందుకు 236.60 లక్షలతో 249మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. 119 ఈవీ ద్విచక్ర వాహనాలు, 59 ఈవీ ఆటోలు, రైతులకు సోలార్‌ పంపులు అందజేస్తున్నట్లు వివరించారు. అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ కింద 59 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రూ.లక్షలోపు యూనిట్లకు 90%, రూ.2లక్షల వరకు 80%, రూ.4లక్షల వరకు 70% రాయితీ ఉంటుందని వివరించారు. ఆసక్తి, అర్హత గల ఎస్సీ అభ్యర్థులు ఈనెల 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటి హార్డ్‌ కాపీలను మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపీడీఓలకు అందజేయాలన్నారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు.

ప్రజావాణి వాయిదా

మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌తోపాటు ఆర్డీఓ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులంతా జనగణన–2027 విధుల్లో ఉన్నందున కార్యక్రమాన్ని వాయిదా వేశామని, ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement