
భయపడాల్సిన అవసరం లేదు
పాపన్నపేట(మెదక్)/టేక్మాల్: సింగూరు నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చినా ఇబ్బంది లేదని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద మంజీరా ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం 50 వేల క్యూసెక్కుల ఫ్లో సింగూరు నుంచి వస్తుందని, లక్ష క్యూసెక్కుల వరకు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. వరద ఉధృతికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే టేక్మాల్ మండలంలోని పెద్ద చెరువు అలు గు, మండలం మీదుగా పారుతున్న గుండువాగును పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రాకపోకలు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్ల మీద నీరు పూర్తిస్థాయిలో తగ్గే వరకూ ప్రజలు బయటకు రావొద్దని, సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఇరిగేషన్, ఇతరశాఖల అధికారులు ఉన్నారు.
లక్ష క్యూసెక్కులు వచ్చినా ఇబ్బంది లేదు
కలెక్టర్ రాహుల్‌రాజ్