
భూముల రీ సర్వే చేయాలి
కొల్చారం(నర్సాపూర్): నియోజకవర్గంలో ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో ముంపునకు గురవుతున్న నదీ పరివాహాక భూముల రీ సర్వే చేపట్టి, మార్కెట్ రేటు ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఘనపురం ఆనకట్టను సందర్శించి, గంగమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గామాతను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆనకట్ట ఎత్తు పెంచడం ద్వారా నీటి సామర్థ్యం పెరిగి రైతులకు మరింత లాభం చేకూరుతుందని గత ప్రభు త్వం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ము ంపునకు గురవుతున్న ప్రాంతాల విషయంలో గతంలో చేపట్టిన సర్వే పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. ప్రస్తుతం ఆనకట్టకు వస్తున్న నీటి ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకొని రీ సర్వే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మెదక్ మాజీ సీడీసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు, యాదయ్య, యాదాగౌడ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్‌గుప్తా, నాయకులు పాల్గొన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి