
పేదరికమే అతి పెద్ద సమస్య
దరిచేరని స్వేచ్ఛ, సమానత్వం
● అధికార యంత్రాంగం నీతిగా పనిచేస్తేనే స్వాతంత్య్ర ఫలాలు ● ‘సాక్షి’ సర్వేలో ఉమ్మడి జిల్లా ప్రజల మనోగతం
సాక్షి, నెట్‌వర్క్:
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా పేదరికమే అతి పెద్ద సమస్య అనే అభిప్రాయం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి అర్హులకు చేరడం లేదనేది స్పష్టమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహించింది. ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? స్వేచ్ఛ – సమానత్వం ఎంత మందికి దరిచేరింది? స్వాతంత్య్ర ఫలాలు అందరికి దక్కాలంటే ఏ రంగం నీతి, నిజాయితీగా పనిచేయాలి? ఇలా మూడు ప్రధాన మైన అంశాలపై సర్వే చేపట్టింది. ఈ అంశాలపై సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో వివిధ వర్గాలకు చెందిన 90 మంది అభిప్రాయాలను సేకరించింది. పేదరికం తర్వాత అతిపెద్ద సమస్య వైద్యమే అని సర్వేలో పేర్కొన్నారు. కుల వివక్ష కూడా ఎక్కువగానే ఉందని, అవినీతి కూడా ప్రధాన సమస్యల్లో ఒకటని తేలింది.
అందని స్వేచ్ఛ–సమానత్వం..
స్వేచ్ఛ – సమానత్వం ఇంకా ప్రజలందరికి చేరువకాలేదని సాక్షి చేపట్టిన సర్వేలో వ్యక్తమైంది. 60 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమారు 28 శాతం మంది కొద్ది మందికే చేరువైందని చెప్పారు. 12 శాతం మంది అందరికీ స్వేచ్చ – సమానత్వం చేరువైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అధికార యంత్రాంగం నీతి నిజాయితీగా పనిచేస్తేనే స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కుతాయనే అభిప్రాయాన్ని సగం మందికి పైగా అభిప్రాయపడ్డారు. చట్టసభలు, న్యాయస్థానాలు మరింత నీతి, నిజాయితీగా పనిచేస్తేనే సాధ్యమవుతుందని తేల్చి చాలా మంది చెప్పారు.
సర్వే ఫలితాలు ఇలా..
స్వాతంత్య్ర ఫలాలుఅందరికీ దక్కాలంటేమరింత నీతి, నిజాయితీగాపనిచేయాల్సిన రంగం?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పటికీ మీరు ఎదుర్కొంటున్న
అతిపెద్ద సమస్య?
స్వేచ్ఛ – సమానత్వం నిజంగానే అందరికీచేరుతోందా?
మీడియా
6
20
చట్టసభలు
45
10
అధికార యంత్రాంగం
న్యాయ
స్థానాలు
నాణ్యమైన
విద్య

పేదరికమే అతి పెద్ద సమస్య

పేదరికమే అతి పెద్ద సమస్య