
మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు సహించం
పీసీసీ ఉపాధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి
చేగుంట(తూప్రాన్): జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పదేళ్లు ఎంపీగా ఉండి దుబ్బాకకు ఏం చేశారో చెప్పాలని పీసీసీ ఉపాధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం వడియారంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రులను అవమానించే విధంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్, హరీశ్‌రావు చెప్పిన మాటలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. పార్టీలకతీతంగా పనిచేస్తే సహకరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, యూత్‌కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు ప్రశాంత్, స్వామి, రాజిరెడ్డి, ఐలయ్య, బాలకృష్ణ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల
అప్రమత్తం: డీఎంహెచ్‌ఓ
చిన్నశంకరంపేట(మెదక్): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ అన్నారు. మంగళవారం నార్సింగి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. కుక్క, పాముకాటుకు అవసరమైన మందులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. గర్భిణులకు అందించే వైద్యం, పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్‌కు పలు సూచనలు చేశారు.
ఆ జీఓలను వెంటనే
సవరించాలి
కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ధర్నా
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం వేతన సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఐదు ప్రిలిమినరీ జీఓలను వెంటనే సవరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లే శం మాట్లాడుతూ 2021 సంవత్సరంలో విడుదల చేసిన కనీస వేతనాల ఐదు రకాల జీవోలను యథాతథంగా వెంటనే గెజిట్ చేయాలన్నారు. 73వ షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ సంబంధించిన 68 రకాల జీఓలను ప్రభుత్వం సవరించడం లేదన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు జారీ చేసిన జీఓలను గెజిట్ చేయకపోవడం వల్ల ప్రతినెలా రూ.6వేల కోట్లు కార్మికులు నష్టపోతున్నారని వాపోయారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీఓలను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సంతోష్, శ్రీనాథ్, శ్రీకాంత్, మల్లేష్, శేఖర్, రాములు, అజయ్, సత్యం, పాల్గొన్నారు.

మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు సహించం

మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు సహించం