
టీఎల్‌ఎంతో బోధన సులువు
పెద్దశంకరంపేట(మెదక్): బోధనాభ్యాస సామగ్రి మేళ (టీఎల్‌ఎం)తో బోఽధించడం ఉపాధ్యాయులకు సులభమవుతుందని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో టీఎల్‌ఎం మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనాభ్యాస సామగ్రిని పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్‌ఎంతో తరగతి గదిలోని చివరి విద్యార్థికి కూడా అర్థమయ్యేలా బోధన ఉండాలని, ఎఫ్‌ఎల్‌ఎంలో జిల్లా ముందుందని చెప్పారు. ఈ నెల 19న జిల్లా స్థాయి మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశం, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు విఠల్, అశోక్‌రెడ్డి, హెచ్‌ఎంలు మారుతి, బి.శ్రీనివాస్, సత్యకుమార్, కుమార్, ఎన్.శ్రీనివాస్, ఆనంద్, ప్రసన్న, రాములు, గోపి, రిటైర్డు హెచ్‌ఎంలు రామచంద్రాచారి,విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
చందాయిపేటలో కస్తూర్బా పాఠశాల
చేగుంట(తూప్రాన్): చందాయిపేటలో వృథాగా ఉన్న ఉన్నత పాఠశాల భవనాలను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి చందాయిపేటలో మాసాయిపేట మండల కస్తూర్బా పాఠశాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని చెప్పారు. పీఎంశ్రీ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయడు కిషన్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అమర్ శేఖర్‌రెడ్డి, తపస్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యాయులు విఠల్‌రెడ్డి, నర్సింలు, ఊర్మిల తదితరులు ఉన్నారు.
జిల్లా విద్యాధికారి రాధాకిషన్
పెద్దశంకరంపేటలో టీఎల్‌ఎంమేళా ప్రారంభం