
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్
చిన్నశంకరంపేట(మెదక్): స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్ కోరారు. మంగళవారం నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి 300 మీటర్ల జాతీయజెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. దేశం కోసం పనిచేస్తున్న సైనికులకు మద్దతుగా నిలవాలని కోరారు.సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, సత్యపాల్‌రెడ్డి, లింగారెడ్డి, గోవింద్, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, లక్ష్మణ్, శ్రీనివాస్, హరిబాబు, రాఖేష్, గురుపాదం, నరేష్, రమేష్, స్వామి, లక్ష్మణ్, దుర్గేష్, స్వామిగౌడ్ పాల్గొన్నారు.