రమణీయం.. రథోత్సవం
కనుల పండువగా దొంతి జాతర
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని దొంతి గ్రామంలో కొలువైన వేణుగోపాలస్వామి ఉత్సవా లు అంగరంగ వైభ వంగా సాగుతున్నాయి. గురు వారం రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున అర్చకుడు గోపాలకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం నుంచి గాంధీ చౌరస్తా వరకు పల్లకీ సేవ నిర్వహించారు. అక్కడి నుంచి మహంకాళీ ఆలయం వరకు రథోత్సవం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు అమరేందర్‌రెడ్డి, సంజయ్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నా యి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం, మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్‌గుప్తా భక్తులకు వా టర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్, వివిధ పార్టీల నాయకులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఉత్సవాలకు హాజరైన భక్తజనం


