వీర జవాన్లకు ఘన నివాళి
వెల్దుర్తి(తూప్రాన్): దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ మృతికి సంతాపంగా మండల కేంద్రం వెల్దుర్తిలో శనివారం రాత్రి యువకులు కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తా నుంచి మొదలైన ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. దారి పొడవునా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మనోహరాబాద్(తూప్రాన్): ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌తో జరుగుతున్న యుద్ధంలో అమరులైన జవాన్లకు మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామస్తులు నివాళులర్పించారు. శనివా రం గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
వీర జవాన్లకు ఘన నివాళి


