
నెల రోజుల నుంచి నీటి తిప్పలు
నర్సాపూర్: మండలంలోని మాడాపూర్ గ్రామంలో నెల రోజుల నుంచి తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారు మాట్లాడుతూ.. గ్రామంలోని మంచినీటి ట్యాంకుకు నీటి సరఫరా చేసే బోరు మోటార్ నెల రోజుల క్రితం పాడైపోయిందన్నారు. బోరు మోటార్ మరమ్మతులు చేయించడంలో గ్రామ కార్యదర్శి, ప్రత్యేక ఆఫీసర్లు నిర్లక్ష్యం చేయడంతో తాము నీటికి ఇబ్బందుల పాలవుతున్నామని ఆరోపించారు. పలుమార్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి నీటి సమస్యను తీసుకుపోయినా ప్రయోజనం లేదని అన్నారు. నల్లాల నుంచి నీరు రానందున వ్యవసాయ బోర్ల నుంచి నీళ్లు ఎత్తుకొచ్చుకుంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు కిష్టయ్య, సంజీవ, మహెందర్, నర్సింలు, లింగయ్య, ప్రభాకర్, బ్యాగరి కిష్టయ్య ఉన్నారు.