ఆర్టీసీలో ‘గుర్తింపు’ పరిమితం..! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ‘గుర్తింపు’ పరిమితం..!

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

● కార్మిక సంఘాల్లో కలవరం ● విధుల్లో ఉన్నవారికే యూనియన్‌ బాధ్యతలు ● రిటైర్ట్‌ నాయకులకు నో ఎంట్రీ

మంచిర్యాలఅర్బన్‌: టీజీఎస్‌ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల కార్యకలాపాలపై యాజమాన్యం పరి మితులు విధించింది. రిటైర్డు, సస్పెండ్‌ ఉద్యోగులు, బయటి వ్యక్తులకు యూనియన్‌ కార్యకలాపాల్లో పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ కింద విడుదల చేసిన తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేయడంతో కార్మిక సంఘాల్లో కలవరం మొదలైంది. గతంలో యూనియన్‌ ఎన్నికల తర్వా త రిటైర్డు నాయకులు, సస్పెండ్‌ ఉద్యోగులు కూడా యాజమాన్యంతో జరిగే చర్చలు, డిపో కార్యకలా పాల్లో చురుగ్గా పాల్గొనేవారు. విస్తృత స్థాయిలో ఆ ఫీస్‌ బేరర్లకు ఆన్‌డ్యూటీ సౌకర్యాలు, డిపో గేట్ల వద్ద మైకులతో సమావేశాలకు స్వేచ్ఛ ఉండగా యా జమాన్యం నిర్ణయంతో పూర్తిగా మారిపోయింది.

అప్పుడు.. ఇప్పుడు..

గతంలో రిటైర్డు సీనియర్‌ నాయకులు యూనియన్లకు దిశానిర్ధేశం చేసేవారు. యాజమాన్యంతో చర్చల్లో పాల్లొనే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే ప్రతినిధులుగా వ్యవహరించాలనే నిబంధన చేదుగా మారింది. యూనియన్‌ జాయింట్‌ మీటింగ్‌లకు హాజరు కావటానికి కానీ, డిపోల్లో చందాల వసూలుకు రిటైర్డు, తొలగించిన ఉద్యోగులతో పాటు బయటి వ్యక్తులను అనుమతించకూడదని స్పష్టం చేసింది.

ఆన్‌డ్యూటీ సౌకర్యాలు..

గతంలో రాష్ట్ర, రీజియన్‌, డిపో స్థాయిల్లో పెద్ద సంఖ్యలో నాయకులకు డ్యూటీ మినహాయింపు ఉండేది. ప్రస్తుతం రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన ప్రధాన యూనియన్‌లో ముగ్గురు, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లకు మాత్రమే ఆన్‌ అదర్‌ డ్యూటీ సౌకర్యం కల్పించారు. మిగతా వారంతా ఎవరి విధులు వారు నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో యూనియన్‌ నేతలు తమకు నచ్చినట్లుగా చందాలు వసూలు చేసుకునే వీలుండేది. ఇప్పుడు జీతం పడిన తర్వాత మూడు రోజులు మాత్రమే, అదికూడా ముగ్గురు ఇన్‌సర్వీసు ప్రతినిధుల ద్వారానే వసూలు చేయాలనే నిబంధన విధించడంపై కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement