శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గనిని మంగళవారం ఫైవ్ స్టార్ రేటింగ్ కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ కోల్ పరిధిలోని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏటా ఉత్తమ గనులను ఎంపిక చేసి వాటికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. ఇందులో భాగంగా కమిటీ సభ్యులు ఈ గనిని తనిఖీ చేశారు. ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ కమిటీ సభ్యులకు స్వాగతం పలికి గని సాధించిన ప్రగతిని వివరించారు. బొగ్గు ఉత్పత్తి, రక్షణ చర్యలు, ఈసీ అనుమతులు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, నూతన సాంకేతిక విధానాలు, స మీప గ్రామాల్లో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై కమిటీ అధ్యయనం చేసి ఫైవ్‌స్టార్ రేటింగ్‌కు ఎంపిక చేస్తుంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క మిటీ సభ్యులు బీయన్ పండిట్, మోహన్‌రావు, శ్రీ దర్, జీఎం(సేఫ్టీ) రఘుకుమార్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, ఎస్వోటు జీఎం కృష్ణ ప్రసాద్, ఏజెంట్ శ్రీధర్, రవికుమార్, ఐకేపీ ఓసీ పీవో ఏవీ రెడ్డి, ఇన్చార్జి ఇంజినీర్ రామకృష్ణ, సేఫ్టీ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.


