పోలీస్‌ టీ20 క్రికెట్‌ టోర్నీ షురూ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ టీ20 క్రికెట్‌ టోర్నీ షురూ

Nov 18 2026 12:08 AM | Updated on Nov 18 2026 12:08 AM

● మొదటి మ్యాచ్‌లో ఫ్యూచర్‌సిటీ జట్టుపై బాసర జోన్‌–2 జట్టు విజయం

మొయినాబాద్‌: తెలంగాణ పోలీస్‌ రాష్ట్రస్థాయి 5వ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మున్సిపాలిటీలోని పెవిలియన్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఐజీ డాక్టర్‌ గజరావు భూపాల్‌, చేవెళ్ల డీసీపీ యోగేష్‌గౌతమ్‌తో కలిసి మొదటి మ్యాచ్‌కు టాస్‌ వేసి ప్రారంభించారు. మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, ఎనికేపల్లిలోని ఏడు గ్రౌండ్‌లలో నాలుగు రోజులపాటు టోర్నమెంట్‌ జరుగనుంది. రాష్ట్రంలోని 21 పోలీస్‌ జట్లు పాల్గొంటున్నాయి. మంగళ, బుధవారాల్లో లీగ్‌ మ్యాచ్‌లు జరుగనుండగా 19న గురువారం క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌, 20న శుక్రవారం ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సందర్భంగా ఐజీ గజరావు భూపాల్‌ మాట్లాడుతూ.. పోలీస్‌ సిబ్బందిలో స్నేహభావం, ఐక్యతను పెంపొందించేందుకే టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య ఫ్యూచర్‌ సిటీ పోలీసు జట్టుపై బాసర జోన్‌–2 జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement