గుర్తింపు పొందిన సంఘాలపై ఆంక్షలు హక్కులను కాలరాయడమే. నోటీసు పెట్టాలన్నా డిపో మేనేజర్ అనుమతి తీసుకోవాలనడం సరికాదు. గత ప్రభుత్వ హయాంలో టీఎంయూ రాష్టస్థాయి, రీజినల్ స్థాయిలో గెలిచిన సంఘాలకు కార్పొరేట్, రీజినల్, డిపో అధికారులతో చర్చించే వెసులుబాటును ఎందుకు తొలగించారో తెలియదు. ఆర్టీసీ యాజమాన్యం పునరాలోచించి రాష్ట్రస్థాయి, రీజినల్‌లో గుర్తింపు పొందిన సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
– గోలి శంకర్, డిపో కార్యదర్శి,
ఎంప్లాయీస్ యూనియన్
తొలగింపు సరికాదు
డిపో సెక్రటరీ పోస్టును కేవలం క్లాజ్–6 (రీజినల్ స్థాయి) యూనియన్లకు పరిమితం చేసి క్లాజ్–3 (రాష్ట్రస్థాయి) యూనియన్లకు పూర్తిగా తొలగించింది. డిపో స్థాయిలో డీఎం, రీజినల్ స్థాయిలో (ఆర్ఎం) జాయింట్ మీటింగ్‌లు నిర్వహించే అధికారం, డిపో సెక్రటరీ పోస్టులు, రిలీఫ్‌లు క్లాజ్–3 యూనియన్‌కు తొలగించడం సరికాదు. క్లాజ్–6 కింద గెలిచిన యూనియన్లకు విధానపరమైన అంశాలపై కార్పొరేట్ స్థాయిలో మాట్లాడే అధికారం, కమిటీలలో సభ్యులను నామినేట్ చేసే అధికారం తొలగించారు.
– శ్రీనివాస్, ఈయూ రీజినల్ అధ్యక్షుడు


