వాహనాలకు విధించి న వేగపరిమితికి మించి వెళ్లడం, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు నడుపుతున్న వారు నిబంధనలు తప్పకుండా పాటించాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వాహనాలు నడుపాలి. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న 27 స్థలాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించాం. సైన్‌బోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధి కారుల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.
– ఎగ్గడి భాస్కర్, డీసీపీ మంచిర్యాల


