చెన్నూర్: జిల్లాలోని శివాలయాల్లో నేటి నుంచి కార్తిక శోభ సంతరించుకోనుంది. మంగళవారం నుంచి కార్తిక మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో భక్తులు శివున్ని ఆరాధిస్తారు. మహిళలు తెల్లవారు జామునే స్నానాలు ఆచరించి తులసి చెట్టు వద్ద దీపం వెలిగిస్తారు. అనంతరం ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. ఈ మాసంలో దీపదా నాలు, ఉసిరి దానాలు, అర్చనలు, అభిషేకాలకు ప్రాధాన్యతనిస్తారు. నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆలయాల్లో మహిళల సందడి నెలకొంటుంది. కార్తిక మాసం శివునికి ప్రీతికరమైన మాసం కావడంతో ఇందులో వచ్చే సోమవారాలకు ప్రత్యేకత ఉంటుంది. ఈ మాసంలో పండుగలు సైతం ఉన్నాయి. సోమవారం ఉపవాసం పాటిస్తా రు. తులసి ఆరాధాన, 365 వత్తులతో దీపాలు వెలిగిస్తారు.
చెన్నూర్ శివాలయానికి ప్రత్యేకత..
చెన్నూర్ శివాలయం ప్రాచీన చరిత్రకు సజీవ సా క్ష్యంగా నిలుస్తోంది. అల్లావుద్దీన్ ఖల్జీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయగా అగస్త్య మహాముని ఆలయాన్ని సందర్శించి శివలింగాన్ని ప్రతిష్టించారని పురా ణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో చెన్నూర్ పట్టణ వాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వచ్చి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆలయంలో ఉన్న అఖండదీపం 365 రోజులు నిరంతరం వెలుగుతూ ఉంటుంది. రాత్రి నిర్వహించనున్న నిషి పూజకు భక్తులు అధికసంఖ్యలో హాజరవుతారు.
శివునికి ప్రీతిపాత్రమైన మాసం..
కార్తిక మాసంలో శివారాధన పుణ్యఫలం ఇస్తుంది. ఈ మా సంలో ఉదయం, సాయంత్రం తులసి చెట్టుకు దీపం వెలిగించాలి. ఆలయంలో దీపదానం ఎంతో శ్రేయస్కరం. 365 వత్తులు వెలిగిస్తే సంవత్సరం పాటు శివున్ని ఆరాధించిన ఫలితం లభిస్తుంది.
– జక్కెపల్లి హిమకర్‌శర్మ,
చెన్నూర్ శివాలయ అర్చకులు
మాసంలో పండగలు..
13న నాగుల చవితి, 14న నాగుల పంచమి, 16న మొదటి కార్తిక సోమవారం, 21న క్షీరాబ్ది ద్వాదశి, 23న రెండో కార్తిక సోమవారం, 24న కార్తిక పౌర్ణమి, 30న మూడో సోమవారం, డిసెంబర్ 6న నాలుగో సోమవారం, 8న కార్తిక మాసం ముగుస్తుంది.


