బెల్లంపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. సికింద్రాబాద్‌లో ఈ నెల 6, 8 తేదీల్లో పోటీలు నిర్వహించారు. ఆదివారం నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లా జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోటీల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ జిల్లా జట్టు 4–0 స్కోర్‌తో నిజామాబాద్ జిల్లా జట్టుపై విజయం సాధించింది. నిజామాబాద్ జిల్లా జట్టు రన్నర్స్‌తో సరిపెట్టుకుంది. విజేతలను ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ బాబురావు అభినందించారు. పోటీలకు కోచ్ అండ్ మేనేజర్లుగా అల్లూరి వామన్, కోట యాదగిరి వ్యవహరించారు.


