బెజ్జూర్: కోడిపందెం స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు మండలంలోని పెద్దసిద్దాపూర్ గ్రామ శివారులో కోడిపందెం స్థావరంపై దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.1,800 నగదు, 4 సెల్ఫోన్లు, 2 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోడిపందెం, జూదానికి పాల్పడినే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ఆసిఫాబాద్క్రైమ్: కాగజ్‌నగర్ మండలం ఈజ్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడపెల్లిలో అర్ధరాత్రి పేకాట ఆడుతున్నట్లు అందిన ముందస్తు సమాచారం మేరకు ఈజ్గాం పోలీసులు దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈజ్గాం ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం బోడపెల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కొందరు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి వెళ్లి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి రూ.2,400 నగదుతో పాటు పేకాట ముక్కలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బ్రేకులు ఫెయిలై లోయలోకి దూసుకెళ్లిన ఐచర్
ఇంద్రవెల్లి: మండలంలోని దొడంద, గట్టెపల్లి ఘాట్ వద్ద మొక్కజొన్న లోడ్‌తో వెళ్తున్న ఐచర్ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం ఇంద్రవెల్లి మండలంలోని ఈశ్వర్‌నగర్‌కు చెందిన అజ్మీరా అందు గాదిగూడ మండలం నుండి మొక్కజొన్న పంటను తెచ్చేందుకు ఐచర్‌ను కిరాయికి పంపించాడు. పంట లోడ్‌తో తిరిగి వస్తుండగా దొడంద, గట్టెపల్లి ఘాట్ వద్ద వాహనం బ్రెకులు ఫెయిలై పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని ముందుగానే గమనించిన డ్రైవర్‌తో పాటు వాహనంలో ఉన్న కూలీలు వెంటనే కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఘాట్ వద్ద కోతకు గురైన రోడ్డును బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
టపాసు నిప్పురవ్వలు
పడి ఇల్లు దగ్ధం
ఆదిలాబాద్‌టౌన్: దీపావళి సంబరాలు ఓ కుటుంబాన్ని దుఃఖంలోకి నెట్టాయి. జిల్లా కేంద్రంలోని పంజేషా మొహల్లాలో ఆదివారం రాత్రి టపాసుల నిప్పురవ్వలు పడి ఓ పెంకుటిళ్లు దగ్ధమైంది. కాలనీకి చెందిన మేకల సత్తమ్మ వర్షపు నీరు ఇంట్లోకి చేరకుండా పైకప్పుపై టార్పాలిన్ కవర్‌తో కప్పుకుంది. దీపావళి సందర్భంగా పలువురు బాణసంచాలు పేల్చగా, ఆ టార్పాలిన్‌పై నిప్పురవ్వలు పడడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని ఫ్రిజ్‌తో పాటు రూ.2లక్షల నగదు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితురాలు వాపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఎఫ్ఎస్ఓ జైత్రాం, సిబ్బంది సుంగన్న, శ్రీనివాస్, ఆంజనేయులు, పృథ్విరాజ్, సూరజ్ పాల్గొన్నారు.


