‘బీసీల ఆత్మగౌరవ భవనాలపై పెత్తనం తగదు’ | - | Sakshi
Sakshi News home page

‘బీసీల ఆత్మగౌరవ భవనాలపై పెత్తనం తగదు’

Nov 10 2026 1:13 AM | Updated on Nov 10 2026 1:13 AM

పాతమంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 14ను వెంటనే రద్దు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. బీసీల ఆత్మగౌరవ భవనాలపై ప్రభుత్వ పెత్తనం సమంజసం కాదని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు పార్టీ పదవుల్లో అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతూనే ఆత్మగౌరవ భవనాల విషయంలో జోక్యం చేసుకోవడం హాని చేసే విధంగా ఉందన్నారు. ఆత్మగౌరవ భవనాల సమావేశాలు, కార్యకలాపాలు నిర్వహించే విషయంలో కుల సంఘాలు, ట్రస్టులకు స్వేచ్ఛ కల్పించాలని, వాటికి శాశ్వత హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు గజెళ్లి వెంకటయ్య, వేముల అశోక్‌, రాయమల్లు, నాగేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement