సారంగపూర్: ఇటీవల జరిగిన రెండు చోరీ కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 6న సారంగాపూర్ పాత బస్టాండ్ ప్రాంతంలో కందూరి రాజమణి ఇంట్లో చొరబడి ఇత్తడి, వెండి సామగ్రి అపహరించారు. అదేరోజు జామ్ గ్రామానికి చెందిన మాన్కల రాజేశ్వర్‌కు చెందిన ప్యాషన్ ప్రో ద్విచక్ర వాహనం దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన ఏ–1 నిందితుడు సుగేందర్, ఆదిలాబాద్‌కు చెందిన గబ్బర్‌సింగ్ రాథోడ్‌ను అరెస్టు చేసి విచారించగా రెండు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ రెండు కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన హెడ్‌కానిస్టేబుల్ జమీర్, కానిస్టేబుళ్లు మాధవ్, రవిని ఎస్పీ జానకీ షర్మిల, డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు.


