నిర్భయంగా ఫిర్యాదు చేయండి | - | Sakshi
Sakshi News home page

నిర్భయంగా ఫిర్యాదు చేయండి

Nov 10 2026 1:13 AM | Updated on Nov 10 2026 1:13 AM

మంచిర్యాలక్రైం: నిర్భయంగా నేరుగా స్థానిక పోలీస్‌సేషన్‌, సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలు విని సంబంధిత స్టేషన్‌ అధికారికి ఫోన్‌ చేసి వివరాలు తెలుకున్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతీ సమస్యను చట్టపరిధిలో త్వరగా పరిశీ లించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ ఎలాంటి సమస్య ఉన్నా చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలని సూచించా రు. అత్యవసర సమయాల్లో 112 నంబర్‌కు డయల్‌ చేసి సమాచారం అందించాలని, వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటార ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement