మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ చాంబర్‌లో సర్వే అండ్ ల్యాండ్ రికార్ట్స్ ఏడీ శ్రీనివాస్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన సర్వే పనులు, రికార్డుల పరిశీలన తదితర ప్రక్రియను వేగవంతం చేయాలని తె లిపారు. ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.


