ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

Nov 3 2026 12:33 AM | Updated on Nov 3 2026 12:33 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన లింగంపల్లి లక్ష్మి డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇప్పించాలని, కన్నెపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన శివలి జగదీష్‌ సమాచార హక్కు చట్టం కింద తాను అడిగిన సమాచారం ఇప్పించాలని కోరారు. ● మంచిర్యాలకు చెందిన లక్షెట్టి రాజమల్లు జీవో 59కింద క్రమబద్ధీకరణ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని, శ్రీశ్రీనగర్‌కు చెందిన జనగామ రాజబాబు 59జీవో కింద పట్టా ఇప్పించాలని విన్నవించారు. ● జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మేకల అక్షయ్‌కుమార్‌ ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌, ఇతర నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని దరఖాస్తు అందజేశారు. ● జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ ప్రతినిధులు 3వ సమావేశాన్ని నిర్వహించి అర్హులైన పాత్రికేయులకు అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 56 దరఖాస్తులు అందాయని తెలిపారు. అనంతరం బీర్సాముండా 151వ జయంతిని పురస్కరించుకుని గ్రామ స్థాయిలో తలపెట్టిన జన జాతీయ గౌరవ దివస్‌ కార్యక్రమాల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ నెల 15వరకు జన జాతీయ గౌరవ దివస్‌లో భాగంగా గిరిజనుల చరిత్ర, వారసత్వం, స్వాతంత్య్ర పోరాటంలో పాత్ర, మౌలిక వసతుల కల్పన, చిత్రలేఖనం పోటీల నిర్వహణ, గిరిజన సంస్కృతి, వ్యాసరచన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన రంగాల్లో ప్రతిభ చూపి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను సన్మానిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement