రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి సీహెచ్‌పీలో బొగ్గు రవాణాకు వినియోగించే కన్వేయర్ బెల్ట్ స్ట్రక్చర్ శనివారం రాత్రి ఒక్కసారిగా విరిగిపోయింది. భారీ శబ్దంతో బెల్ట్ వెనక్కి వెళ్లిపోయింది. ఘటన సమయంలో అ క్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమా దం తప్పింది. విషయం తెలుసుకున్న ఏరియా జీఎం రాధాకృష్ణ ఆదివారం ఘటనా స్థలాన్ని పరి శీ లించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా కంటే కార్మికుల రక్షణే ముఖ్యమని, భద్రతా ప్రమాణాలు, రక్షణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని సూచించా రు. విరిగిపోయిన బెల్ట్‌ను తిరిగి పునరుద్ధరించారు.


