నెమలి పింఛం టోపీల తయారీకి మండలంలోని పాటగూడ గ్రామం ప్రసిద్ధి గాంచింది. గడిచిన పాతికేళ్ల నుంచి ఈ గ్రామస్తులు నెమలి టోపీలు తయారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనూర్, సిర్పూర్(యూ), కెరమెరి, తిర్యాణి, వాంకిడి తదితర గ్రామాలకు చెందిన వారు ఇక్కడి నుంచి నెమలి టోపీలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. గ్రామస్తులు పది రోజుల క్రితమే టోపీల తయారీ పనులు ప్రారంభించారు. ఒక్కో నెమలి పింఛం టోపీ ఖరీదు రూ.10వేల వరకు ఉంటుంది. గుస్సాడీ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమై దీపావళి వరకు కొనసాగుతాయి. ఇప్పటికే ఆయా గ్రామాలు దండారీ ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి.


