మంచిర్యాలక్రైం: పోలీస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ ఆండ్ గేమ్స్ మీట్ 2026 క్లస్టర్–సీ పోటీలు హైదరాబాద్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో గత నెల 28 నుంచి 30వరకు జరిగాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున 17మంది పోలీస్ అధికారులు పాల్గొని సత్తా చాటారు. ఒక రజతం, ఆరు కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారును శుక్రవారం ఆయన చాంబర్‌లో ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం
Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM
● టేబుల్ టెన్నిస్ విభాగం అండర్–50 మిక్స్‌డ్ డబుల్స్‌లో ఏసీపీ ప్రతాప్, కానిస్టేబుల్ ఎం.వనిత, అండర్–40 సింగిల్స్‌లో పీసీ ఎం.ఉదయ్‌కిరణ్, ఓపెన్ మహిళా డబుల్స్‌లో కే.విజయ, కే.దీప, మహిళా డబుల్స్ ఎం.వనిత, కే.విజయ, అండర్–40 మిక్స్‌డ్ డబుల్స్‌లో కానిస్టేబుల్ డీ.రాజేందర్, ఎం.వనిత ప్రతిభ కనబరిచి ఐదు కాంస్య పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్ వి భాగంలో ఓపెనింగ్ సింగిల్స్‌లో కే.సురేష్ రజత పతకం, ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కే.సురేష్, కే.విజయ జోడి కాంస్య పతకం సాధించారు.
Advertisement


