శ్రీరాంపూర్: సింగరేణిలో పెరిక ఉద్యోగులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీరాంపూర్‌లోని పీవీఆర్ గార్డెన్‌లో సింగరేణి పెరిక కుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న పెరిక కుల ఉద్యోగులు వారి సమస్యలపై సమన్వయం చేసుకుంటూ పరిష్కారం కోసం పని చేయాలి అన్నారు. గనుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ఏరియా కమిటీ ఎన్నిక
పెరిక కుల ఉద్యోగుల ఏరియా కమిటీని ఎన్నుకున్నారు. శ్రీరాంపూర్ అధ్యక్షుడిగా తీర్థాల సదానందం, ఉపాధ్యక్షుడిగా ఆకుల కృష్ణంరాజు, కార్యదర్శి గా కారుకూరి శ్రీనివాస్, సెక్రెటరీగా ఎంబడి శ్రీని వాస్, కోశాధికారిగా పేరం మనోహర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, కోకాపేట భవన్ వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, పెరిక హాస్టల్ జనరల్ సెక్రెటరీ అచ్చా రఘుకుమార్, రాష్ట్ర నాయకులు బోడకుంట ప్రకాష్, మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, జిల్లా అధ్యక్షుడు బొడ్డు శంకర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజుకిరణ్, జిల్లా అధ్యక్షురాలు అత్తి సరోజ, నాయకులు పాల్గొన్నారు.


