తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు నేటితో 50 ఏళ్లు 1976లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రారంభం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పేరు మార్పు
కాగజ్‌నగర్‌టౌన్: 1976 అక్టోబర్ 3వ తేదీన ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా తన ప్ర యాణాన్ని ప్రారంభించిన రైలు శనివారంతో 50 వసంతాలు పూర్తి చేసుకోనుంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, నాటి రైల్వే మంత్రి మధు దండవతే కలిసి సికింద్రాబాద్‌లో ఈ రైలును ప్రారంభించారు. అప్పటి వర కు హైదరాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కేవలం దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే సేవలు అందిస్తూ ఉండే ది. 1976 అక్టోబర్ 3న 123/124 నంబర్లతో ప్రా రంభమైన ఈ రైలు డీజిల్ ఇంజన్‌తో ప్రారంభమై ప్రస్తుతం విద్యుత్ ఇంజన్‌తో పరుగులు పెడుతోంది. మొదట ఐసీఎఫ్ బోగీలతో 2019 వరకు నడిచింది. ఆతర్వాత జర్మన్ సాంకేతికతతో కొనసాగుతోంది. 2011 వరకు 2723/24 గా ఉన్న రైలు నంబర్ ఆ తర్వాత 12723/24 గా మారింది. ప్రారంభంలో ఈ రైలుకు కేవలం కాజీపేట్ జంక్షన్‌లో మాత్రమే స్టాప్ ఉండేది. ఆ తర్వాత సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండంలో స్టాప్ కల్పించారు. 1991లో అప్ప టి మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ ఆర్. కృష్ణారావు కృషితో మంచిర్యాలలో, ఆ తర్వాత బెల్లంపల్లిలో స్టాప్ ఏర్పాటు చేశారు.
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బదులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాలని డిమాండ్ వచ్చింది. 2015 నవంబర్15న ఈ రైలు పేరును తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఈ రైలు తెలంగాణ, మహా రాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరుకుంటుంది. ప్రస్తుతం తెలంగాణలోని ముఖ్య జిల్లా కేంద్రాలు, జంక్షన్లలో స్టాప్ కల్పించాలని, ముఖ్యంగా పెద్దపల్లి జంక్షన్‌లో స్టాప్ కల్పించాలని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం కోరుతోంది, అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా నాంపల్లి రైల్వే స్టేషన్‌లో రైల్వే అభిమానుల మధ్య సంబరాలు నిర్వహించనున్నట్లు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యులు తెలిపారు.


