కెరమెరి: మండలంలోని కెలికె గ్రామానికి చెందిన యువ పర్వతారోహకుడు గిత్తే కార్తిక్ ఐఎంఎఫ్ (ఇండియన్ మౌంటంగ్ ఫౌండేషన్) ట్రెక్ –2026కు ఎంపికయ్యాడు. శుక్రవారం ఎన్‌పీడబ్ల్యూసీఎస్‌డబ్ల్యూఎఫ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ వెంకట్ ముండే కార్తిక్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించి అభినందించారు. కార్తిక్ ఇప్పటికే బీఎంసీ, ఏఎంసీ పర్వతారోహణ శిక్షణలు పూర్తి చేయడంతో పాటు 5,900 మీటర్ల ఎత్తు వరకు పర్వతా రోహణ చేశారు. ఐఎంఎఫ్ ట్రెక్‌లో పాల్గొనేందుకు విమాన టికెట్లను వెంకట్ స్పాన్సర్ చేసి అభినందించారు. భవిష్యత్తులో చేపట్టనున్న ఎవరెస్ట్ బేస్ క్యాంపు యాత్రకు కూడా సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.


