శ్రీరాంపూర్: బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచా లని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపా రు. సోమవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏరియా అధికారులతో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణాపై స మీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యానికి అదనంగా 10శాతం ఉత్పత్తి పెరగాలన్నారు. కొత్త పని ప్రదేశాలను తయారు చేసుకోవాలని, వాటి అనుమతులు, డ్రిల్లింగ్, అందులో వినియోగించే ఎస్‌డీఎల్ యంత్రాల వివరాలపై అధి కారులతో చర్చించారు. మార్కెట్‌లో కోల్ డిమాండ్ అధికంగా ఉందని ఈ సమయంలో దానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచుకో వాల్సిన అవసరం ఉందన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తి అయిన బొగ్గును సకాలంలో రవాణా చేయడం కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఏరియా ఇంజనీర్ సురేశ్, ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు అధికారి ఏవీ రెడ్డి, ఏజెంట్‌లు యన్.శ్రీధర్, రవికుమార్ డీజీఎంలు రాజన్న, మల్లయ్య, పర్చేస్ అధికా రి చంద్రశేఖర్, క్వాలిటీ ఇన్‌చార్జి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


