దండేపల్లి: మండలంలోని లక్ష్మీకాంతపూర్ గ్రామాని కి చెందిన బాదినేని అరవింద్(26) అనే యువకుడు అదృశ్యమయ్యాడు. అరవింద్ ఆదివారం సాయంత్రం లక్సెట్టిపేట వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బజాజ్ డిస్కవర్ బైక్‌పై వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫోన్ చేయగా వస్తున్నట్లు చెప్పాడు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బంధువులకు ఫోన్ చేసి ఆరా తీయగా ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉ దయం అతని బైక్ దండేపల్లి మండలంలోని గూడెం గోదావరి నది వంతెనపై కనిపించింది. కానీ అతని ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అతను గోధుమ కలర్ ప్యాంట్, తెల్ల గీతల షర్టు ధరించి ఉన్నాడని కుటుంబీకులు పేర్కొన్నారు. ఈమేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు.


